Mangoes…. మామిడి పండు
మామిడి పండు మంచి రుచి గలవి. ఈ కాయలు ఉష్ణమండలపు పంట. వీటిలో 1000 రకాలకు పైగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా కేలరీలు ఉండటం వలన బరువు పెరగాలనుకునే వారికి మంచి ఆహారం.
ఎక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన బరువు పెరగటం జరుగుతుంది. మామిడిలోని ఫెనోలిక్ మిశ్రమంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ వ్యాధిని నిరోధించే లక్షణాలున్నాయి. మామిడిలోని ఇనుము గర్భవతులకు, రక్తహీనతతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. మూసుకుపోయిన చర్మరంధ్రాలు తిరిగి తెరుచుకోవటానికి మామిడి దోహదకారి. మామిడిలోని విటమిన్ ‘ఎ’ విటమిన్ ‘ఇ’ సెలీనియం గుండె జబ్బుల నుండి రక్షణనిస్తాయి. ఆహారకోశంలోని ఎసిడిటీని తగ్గించటంలో, అరుగుదలను మెరుగు పరచటంలో సహాయకారి. మామిడి పండులో విటమిన్ ‘ఇ’ హార్మోన్ వ్యవస్థ పనితీరు మెరుగు పరచి తద్వారా సంసారసుఖం బాగా ఉండేటట్లు చేస్తుంది. ఉబ్బసాన్ని తగ్గించటంలో, నొప్పులను, వాపు తగ్గించే గుణం మామిడిలో కలదు.