header

Manila Tamarind…Madras Thorn.. సీమ చింత కాయలు...

దీని శాస్త్రీయ నామం...Pithecellobium dulce. ఈ చెట్టు కాండం, కొమ్మలు అన్నీ ముళ్లమయం. చెట్టను ఎక్కటానికి వీలు కాదు. పచ్చి కాయలలోని పండు తెల్లగా ఉండి వగరు రుచితో ఉంటుంది. కాయలు పండితే గులాబీరంగులోకి మారి తీపి, వగరు రుచులతో ఉంటుంది. ఈ చెట్లు భారత దేశానికి చెందినవి కావు. ఈ చెట్లును సాధారణంగా పెంచరు. కాలువ గట్ల వెంబడి, ఖాళీ ప్రదేశాలలో ఈ చెట్లు పెరుగుతాయి. ఫిలిపైన్స్ దేశంలో ఈ కాయల కోసం తోటలను సాగుచేస్తారు.
ఈ పండ్లలోని విటమిన్ – సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గుతోపాటు రక్తం పడుతున్న వారు ఈ పండ్లను తింటే మేలు చేస్తాయి అంటున్నారు. ఈ పండ్లలోని బి-కాంప్లెక్స్ ఒత్తిడిని తగ్గించి ఆకలిని పెంచుతుంది.
డయాబెటిక్ తో బాధపడేవారికి, అల్సర్ రోగులకు ఈ పండ్లు మేలు చేస్తాయి. లైంగిక వ్యాధులను తగ్గిస్తాయి. ఈ కాయలతో కూరలు కూడా చేసుకుంటారు. మటన్, చికెన్ లలో వేసుకుంటారు. కొలస్ట్రాల్ ను, పక్షవాతం రాకుండా నిరోధిస్తాయి. సంప్రదాయ వైద్యులే కాకుండా ఆధునిక పరిశోధకులు సైతం దీని ఆకులూ, బెరడులతో క్యాన్సర్లు, పక్షవాతం వాటి వంటికి మందులు తయారవుతున్నాయి. ఈ చెట్టును మిరకిల్ ట్రీ అంటారు. ఇవి సీజనల్ ఫ్రూట్స్. ఎండాకాలంలో మాత్రమే లభిస్తాయి.