header

Orange

నారింజ

రోజుకో గ్లాసునారింజ రసాన్ని తీసుకుంటే కిడ్నీలలోని రాళ్లు తొలగిపోతాయని నిపుణుల అభిప్రాయం.
క్యాల్షియం వంటి రసాయనాల గాఢత పెరిగిపోవడం వలన కిడ్నీలలో రాళ్లు ఏర్పడతుంటాయి. పొటాషియం సిట్రేట్ అధికంగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకుంటే కిడ్నీలలోని రాళ్లసమస్యను నివారించవచ్చని ఆహార నిపుణుల అభిప్రాయం. మిగిలిన సిట్రస్ ఫలాలకంటే నారింజలోని సిట్రేట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది.
నారింజరసాన్ని తీసుకోవటం వలన మూత్రంలో ఆమ్లతత్వం తగ్గి కిడ్నీలలో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
నారింజలోని బీటా కెరటోన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అందుకే నారింజ తినటం వలన చర్మం నిగనిగలాడుతుంది. ఒమేగా – 3, ఒమేగా-6 ఆమ్లాలు సమృద్ధిగా లభించడం వలన డయాబెటిస్ ను అదుపులో ఉంచటంలొ తోడ్పడుతుంది. గుండెజబ్బువారికి చాలా మంచిది. ఇందులో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వలన జీర్ణశక్తి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ శరీరం త్వరగా ఎదగటానికి గాయాలు నయం కావటానికి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.