బొప్పాయి ఉష్ణమండల ప్రాంతపు పండు. సంవత్సరమంతా దొరకుతుంది కానీ వేసవికాలంలో ఎక్కువగా పంట వస్తుంది. తీయని రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో పోషకాలున్నాయి.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు తొడ్పడుతుంది. పండిన బొప్పాయి తేలికగా జీర్ణమై మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
మూడురోజులు బొప్పాయిని మాత్రమే తింటే కడుపుని, పేగులను శుద్ధి చేస్తుంది. బొప్పాయి రసం పెద్దపేగులోని అంటురోగాలను తొలగించటంలో గొప్పగా ఉపయోగ పడుతుంది. అన్నవాహికలోకి మ్యూకస్ పొరను కాపాడుతుంది. పండిన బొప్పాయి తినటం వలన గ్రంథులలోను, కొన్ని అవయవాలలోను, రక్షణపొర తొగిపోవటం వలన వచ్చే క్యాన్సర్‌ను రాకుండా ఆపుతుంది. వికారం, వాంతులు, వేవిళ్ళు తగ్గించటంలో, మలబద్దకాన్ని పోగొట్టటంలో ఎంతో సహాయకారి.
బొప్పాయి గింజల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే కడుపులో ఉండే నులిపురుగులు, ఏలికపాములు బయటకు వెళ్ళిపొతాయి. ముందుగా వచ్చే వృద్ధాప్య లక్షణాల నుండి బొప్పాయిలోని పునర్ యవ్వనాన్నిచ్చే గుణం కాపాడుతుంది. ప్రతిరోజు ఒక బొప్పాయి తినటం వలన శరీరానికి కావలసిన శక్తి తిరిగి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. బొప్పాయిలోని శుద్ధిచేసే, శుభ్రపరిచే లక్షణం వలన సబ్బులలో, హ్యాండ్‌వాష్‌లలో, బట్టలు ఉతికే సబ్బులలో దీనిని వాడతారు. బొప్పాయిలో కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ డి, మినరల్స్, పీచు మొదలైన యాంటీ ఆక్సిడెంట్ పోషకాలున్నాయి. ఇవి గుండె, రక్తనాళవ్యవస్థల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఆపుతాయి. బాగా పీచు ఉండటం వలన బొప్పాయి మన శరీరంలోని అధిక కొవ్వును తగ్గిస్తుంది. బొప్పాయి గుజ్జు చర్మంపై వచ్చే పుండ్లమీద లేపనంగా కూడా వాడవచ్చు.