header

Pears…..బేరిపండు (పియర్స్‌)

బేరిపండు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమ దానిమ్మకు దగ్గర సంబంధం కలిగి వుంది. ఈ పండు యొక్క తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులలో గాని లేక రెండు మూడురంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలిభాగం తెలుపు లేక లేత పసుపురంగులో ఉంటుంది. బాగా తియ్యగా, రసాత్మకంగా ఉంటుంది. ఈ కండలోపల మధ్యలో గింజలుంటాయి.ఈ పండు కండభాగం చాలా వెడల్పుగా గుండ్రంగా ఉండి పైకి వచ్చేకొద్దీ సన్నబడుతూ వుంటుంది.రూపం రంగు, రుచి, పరిమాణం నిల్వ వుండే లక్షణాల మీద అధారపడి ఎన్నోరకాలుగా మనకు లభిస్తాయి
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ వలన కలిగే ఆక్సిజన్‌కు సంబంధించిన హాని నుంచి బేరిపండులో పుష్కలంగా విటమిన్‌ సి కలిగి వుండటం చేత యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల వలన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ పండులో ఉన్న పీచు మలబద్దకాన్ని తగ్గించటంలో సహాయం చేస్తుంది. శరీరంలోని మలాన్ని బయటకు పంపటంలో క్రమత్వాన్ని ఇస్తుంది.
బేరిపండును తినటం వలన స్త్రీలలో మెనోపాజ్‌ తర్వాత వచ్చే వక్షోజాల క్యాన్సర్‌ రాకుండా ఆపవచ్చు. బేరిపండును హైపోఎర్జనిక్‌ పండు అంటారు. ఇది మిగతా అన్ని పళ్ళతో పోలిస్తే దీనివలన కలిగే వ్యతిరేక పరిణామాలు తక్కువ. క్రమం తప్పకుండా బేరిపండ్లు తింటే వయసురీత్యా కలిగే కండరాల శైధిల్యాన్ని ఆపవచ్చు. కండరాల శైధిల్యం వలన వయసు పైబడిన వారిలో దృష్టిలోపం ఏర్పడుతుంది. బేరిపండు రక్తపోటును తగ్గించి గుండెపోటు రాకుండా ఆపుతుంది. ఇందులో ఉన్న పెక్టిన్‌ కొవ్వును తగ్గించటంలో ఉపయోగ పడుతుంది.
పెద్దపేగు ఆరోగ్యంగా పనిచేయటానికి ఈ పండు సహాయపడుతుంది. బేరిపండు రసంలో గ్లూకోజు, ఫ్రక్టోజు పుష్కలంగా ఉండటం వలన తక్షణశక్తి లభిస్తుంది. ఒక గ్లాసు బేరిపండు రసం తాగితే జ్వరం త్వరగా తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచటానికి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు సహాయం చేస్తాయి.
శరీరంలోని వివిధ భాగాల్లో వచ్చే వాపు, మంట, నొప్పి తగ్గడానికి బేరిపండు రసం ఎంతో మంచిది. బేరిపండులోని బొరాన్‌ శరీరంలోని క్యాల్షియం నిలిచి వుండేట్లు చేసి తద్వారా ఎముకల క్షీణతను అరికడుతుంది. బేరిపండులో ఉన్నటువంటి ఫాలైట్‌ పసిపిల్లలలో న్యూరాల్‌ ట్యూబ్‌ లోపాలను రాకుండా ఆపుతుంది.