header

Pineapple

పైనాపిల్ – అనాసపండు

ఫైనాపిల్ లో పోటాషియం పుష్కలంగా ఉండటం వలన బి.పిని తగ్గిస్తుంది. ఇందులోని సి విటమిన్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దంతాలు, చిగుళ్లు వంటిని బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుంది. ఫైనాపిల్లోని బీటా కెరోటిన్ ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఆస్తమా, కండరాల క్షీణతను తగ్గిస్తుంది. క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్ అనే ఎంజైమ్ సమర్ధంగా నివారించగలదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంటుంది. ఈ ఎంజైమ్ పుండ్లూ, గాయాలు త్వరగా మానేందుకూ తొడ్పడుతుందని తేలింది. ఇందులోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరకే యాంటీ ఆక్సిడెంట్లు స్త్రీలలో సంతానోత్పత్తికి తోడ్పడతాయంటారు.