స్టార్ ఫ్రూట్స్ వేసవిలో మాత్రమే పండుతాయి. ఇవి నక్షత్రాకారంలో పొడుగ్గా ఉంటాయి. పండ్లపైన మైనపు పూతలాగా ఉంటుంది. పచ్చి కాయలు నిమ్మ ఆకుపచ్చ రంగులో ఉండి తినటానికి వగరుగా, పులుపుగా ఉంటాయి. పండిన పండ్లు లేత పసుపు పచ్చ రంగులో ఉండి తినటానికి తియ్యగా పులుపుగా ఉంటాయి. ఈ పండ్లను చక్రల్లాగా కోసి ఉప్పు, కారం చల్లుకుని తింటారు. ఇవి సెప్టెంబర్ – అక్టోబర్ మాసాలలో మరియు జనవరి- ఫిబ్రవరి మాసాలలో లభిస్తాయి.
వీటిలో పుల్ల రుచి రకాలు, తీపి రుచి కాయలు రెండు రకాలుంటాయి.
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పీచు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది. మలబద్దకానికి మంచివి. వేసవి వేడి నుంచి తట్టుకోవటానికి ఇవి మంచివి. స్టార్ ఫ్రూట్లలో విటమిన్ – ఎ, బీటాకెరటోన్లు పుష్కలంగా ఉండటం వలన గర్బిణీ స్త్రీలతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పెక్టిన్ కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారు వీటిని తినకూడదంటారు.