వేసవిలో విరివిగా లభించే కమలాలలో నీరు తక్కువగా ఉండి చక్కెరశాతం ఎక్కువగా ఉంటుంది. కొంచెం తియ్యగా, కొంచెం పులుపుగా ఉండే వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. అందుబాటు ధరలలో కూడా ఉంటాయి.ఎండదెబ్బ, తాపం నుండి తప్పించుకోవాలంటే కమలాలను ఎక్కువగా తినాలి.కమలా పండు శాస్రీయ నామం ఆరెంజ్ క్లాటస్ ఆరంటం కమలాపండ్లు ఎక్కువగాల ఆంధ్ర్రప్రదేశ్ లోని కోడూరు (కడపజిల్లా) వడ్లమూడి (గుంటూరు జిల్లా) నంద్యాల (కర్నూలు జిల్లా) ప్రాంతాలలో ఎక్కవగా పండుతాయి. వీటి దిగుబడి చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.v
నారింజ, బత్తాయి లాగానే ఇవి కూడా నిమ్మజాతికి చెందిన పండ్లు. వీటి పుట్టుక స్థానం మాత్రం స్పెయిన్ లోని కనరీ ద్వీపం అంటారు.v
రోగనిరోధకశక్తి సరిగ్గా ఉంటే మనం ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కోగలం. కమలాలలో బీటా కెరోటిన్, ఫోలిక్ ఆమ్లం, ఎ , బి.సి, విటమిన్లు, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం లవణాలు ఎక్కవగా ఉంటాయి. దీంతో మనకు రోగనిరోధకశక్తి ఎక్కవగా లభిస్తుంది.v
కమలాలు ఆహార నాళాలలో పేరుకున్న విషక్రిములను, క్యాన్స కణాలను తొలగించటంలో సహాపడతాయి. జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం తగ్గుతుంది. దంతాలు, ఎముకలు ధృఢంగా ఉంటాయి. కీళ్లనొప్పులు త్వరగా రావు
జలుబు తగ్గుతుంది. రక్తం సాఫీగా సాగుతుంది. కమాలను క్రమం తప్పకుండా తింటే గుండె జబ్బులు రావు, అలసట కూడా తగ్గుతుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లను కరిగిస్తాయి. చర్మవ్యాధులు కూడా రావు. చర్మం కూడా మెరుస్తుంది.
కమలాలను జ్యూస్ గా కంటే నేరుగా తొనలనే తింటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. కమలా తొక్కలు కూడా సువాసనగా ఉంటాయి. కమలా తొక్కలను ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే సున్నిపిండిలో కలుపుతారు.
జాగ్రత్తలు : కమలాలు సిట్రస్ జాతికి చెందిన పండ్లు ( నిమ్మ, నారింజ, బత్తాయి ) డదు. వీటిలో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. భోజనం తరువాత కానీ, అల్పాహారం తిన్న గంట తరువాత తింటే మంచిది. వీటిలోని ఆమ్లాలు ఖాళీకడుపులోని అల్సర్స్ ను పెంచుతాయి.
పాలు, పెరుగు, పాలపదార్ధాలు తిన్న తరువాత కూడా వీటిని తినకూడదు. కమలాపండ్ల జ్యూస్ లో పాలు కలపకూడదు. వేసవిలో పిల్లలకు కూల్ డ్రింక్స్ బదులు కమలాపండ్ల రసం చల్లబరిచి ఇస్తే ఇష్టంగా తాగుతారు, ఆరోగ్యం కూడా.