తాటి కాయలు : భారతీయ గ్రామీణ జీవితంలో ఎంతగానే ముడివేసుకున్న చెట్లలో తాటి చెట్టు ఒకటి. తాటి కాయలలో రెండు లేక మూడు ముంజలు ఉంటాయి. ఎక్కువగా మూడు ముంజలుంటాయి. పైన పలుచటి పొరతో లోని తెల్లటి గుజ్జుతో,
కొద్దిగా నీటితో , వగరు తియ్యదనంతో ఉంటాయి. తాటికాయలను కోసి ముంజెలను బయటకు తీసినపుడు అవి చల్లగా ఫ్రిజ్ లో పెట్టిన వాటిలాగా ఉంటాయి. తాటి కాయలు కేవలం ఎండాకాలంలో మాత్రమే కాస్తాయి. తాటి చెట్టు 30 మీటర్ల
ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ
చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. పల్లెలలో తాటి ఆకులను ఇంటి కప్పులకు ఉపయోగిస్తారు. చెట్లకాండాలను చేపలు పట్టే పడవలుగాను మరియు ఇళ్ళ నిర్మాణాలలో వాడతారు. మార్చి,
ఏప్రియల్ మాసాలలో తాటిపండ్లు అందుబాటులో ఉంటాయి. తాటి పండ్లను కోయకుండా చెట్లకు అలాగే ఉంచితే అవి పండుగా మారతాయి. వీటిలో ఉండే గుజ్జు చాలా రుచికరంగా ఉంటుంది. వీటిని నిప్పులమీద గాని, పొయ్యిమీద గాని బాగా
కాల్చి తింటారు. ఈ గుజ్జుతోనే తాటి తాండ్ర తయారు చేస్తారు.
వేసవిలో మనం కోల్పేయే విటమిన్లను తాటి ముంజెలు తినటం ద్వారా పొందవచ్చు. తాంటి ముంజెలలో కాల్షియం, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్, ధియామిన్, రిబోఫ్లేవిన్ ఉంటాయి. వేసవి మూడునెలలో తాటిపండ్లను క్రమం తప్పకుండా తింటే ఉదర
సమస్యలు, చర్మసంబంధ వ్యాధులు తగ్గుతాయి. ముంజెలను ముఖం మీద రాసుకుంటే నల్లమచ్చలు పోతాయి.
తాటి కల్లును నీరా అంటారు. 40 రోజుల పాటు ఉదయాన్నే తాటికల్లును తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందని చెబుతారు.
తాటికల్లు 40 రకాల వ్యాధులకు నివారణగా చికిత్సగా ఉపయోగపడుతుందని చెబుతారు.
తాటికల్లు నుండి తాటి బెల్లం తయారు చేస్తారు. దీనిని మధుమేహ రోగులు కూడా వాడవచ్చంటారు.
తాటిబెల్లంలో అధిక రక్తపోటును తగ్గించే మెగ్నీషియం, పోటాషియం, ఐరన్ ఉంటాయి. ఎండా కాలంలో హాని చేసే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లు తాగకుండా తాటిముంజలు తినటం వలన మనకూ మరియ మన రైతులకు ప్రయోజనం ఉంటుంది.