వాటర్ యాపిల్, రోజ్ యాపిల్,గులాబ్ జామూన్ కాయలు అని కూడా పిలుస్తారు. తెలుగులో కమ్మరి కాయలు అంటారు. సిజియం సమంరాంజేసి దీని శాస్త్రీయ నామం. వాటర్ యాపిల్ మూడు నుండి
పదిమీటర్ల ఎత్తులో పెరుగుతుంది. దీని అకులు పదిహేనుసెంటీమీటర్ల పొడవులో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొంచెం సువాసనగా ఉండి తెల్లగా ఉన్న పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
ఈ చెట్టు కాయలు నున్నగా మైనపు పూత పూసినట్లు గంట ఆకారంలో గుత్తులు, గుత్తులుగా కాస్తాయి. గులాబీ, ఎరుపు, మీగడ రంగులలో కాయలు కాస్తాయి. ముదురు రంగులో ఉన్న కాయలు
ఎక్కువ తీపిగా ఉంటాయి..
ఈ పళ్లలో నీటిశాతం ఎక్కువ. గంగరేగు కాయలకు దగ్గరగా, వాటికంటే తక్కువ తీయగా ఉంటాయి. ఈ కాయలు తింటే దాహం తీరుతుంది కనుక పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు.