పుచ్చకాయలలో 92 శాతం నీరే. అధిక వేడినుండి, వడదెబ్బనుండి కాపాడుతుంది. పుచ్చకాలలోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలోని బి విటమిన్ శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ఈ కాయలలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మూత్రనాళాల, మూత్రపిండాల ఇబ్బందులున్నవారికి పుచ్చకాయ ఒక దివ్య ఔషధం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుచ్చ హానికారక ఫ్రీరాడికల్స్ ను అద్భుతంగా నివారిస్తుంది. పుచ్చకాయను తినటం వలన అంగస్థంభన సమస్యలు రావని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పుచ్చకాయలలోని సిట్రులైన్, ఆర్గినైస్ పదార్ధాల వలన ఇది సాధ్యపడుతుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించటం వలన శరీరంలోని రక్తనాళాలు రిలాక్స్ కావటానికి ఈ చర్య తోడ్పడుతుంది.