ఈత చెట్లనుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి. ఇవి పండిన తరువాత ఎరుపు, కాషాయరంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయు. ఈత చెట్టు కాండానికి గాటు పెట్టి ఈత కల్లు సేకరిస్తారు. ఈతకల్లుతో ఈత బెల్లం తయారు చేస్తారు.
ఈత పండ్లు పండిన తరువాత, మందపాటి తొక్కతో, కొద్దిగా గుజ్జుతో తియ్యగా ఉంటాయి. క్యాల్షియం, పీచు అధిక శాతంలో ఉంటాయి. ఈ పండ్లను తింటే గొంతు నొప్పి, పేగు సమస్యలు, జ్వరం, జలుబు, ఆస్తమా, కాలేయ, పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయని పరిశోధనలలో తేలింది.
ఈ పండ్లు నడుం నొప్పిని, మూత్ర సమస్యలను, వాంతులను తగ్గిస్తాయంటారు. సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను జ్వరాలు, పొట్ట సమస్యలు, మలబద్దకం, గుండెజబ్బులు ఇతర వ్యాధులు మందులా వాడుతుంటారు. తెలుగు రాష్ట్రాలలో పట్టణాల కంటే పల్లెలలో ఎక్కువగా లభిస్తాయి