header

Wood Apple

వెలగపండు

వెలగపండుతో చేసే పెరుగు పచ్చడి, పప్పు కూరని తినాల్సిందేనంటారు. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపి పులుపూ కలిసిన రుచితో ఉంటుంది. దీనిన బెల్లం లేదా తేనె అద్దుకుని తింటారు. వెలగపండు జ్యూస్ దాహార్తిని తీరుస్తుంది.
పోషకాలు :
100 గ్రాముల వెలగపండు గుజ్జు నుండి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రాముల పిండి పదార్ధాలు, 2 గ్రాముల ప్రొటీన్లు, బీటా కెరోటిన్, థైమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఐరన్ లు ఉంటాయి, విరేచనాలు, జ్వరం, మలబద్ధకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు.
వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. జ్యూస్ రూపంలో తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలను పేగులోని నులిపురులను నాశనం చేస్తుంది. గుజ్జలో కాస్తం ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తహీనత లేకుండా చేస్తుంది. ఈ జ్యూస్ 50 మి.గ్రాములు తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే రక్తశుద్ధి జరుగుతుంది.
ఆగకుండా వెక్కిళ్ళు వస్తే ఈ పండు జ్యూస్ తాగితే వెక్కిళ్ళు తగ్గుతాయి. అలసట నీరసం వస్తే ఈ పండులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఈ పండ్ల గుజ్జు తింటే సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు.
బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన కాలేయ సమస్యలు తగ్గతాయి. ఆడవారు ఈ పండ్లను తరచుగా తినటం వలన రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ పండ్లతో చేసిన చట్నీ లేక రైతా తినటం వలన హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. పాలిచ్చే తల్లులకు ఈ జ్యూస్ లో శొంఠిపొడి, బెల్లం కలిపి తీసుకుంటే పాలు బాగా పడతాయి. ఈ పండ్ల గుజ్జలో తేనె కలిపి తీసుకుంటే వేసవిలో దాహార్తిని తీరుస్తుంది. అలాగే నోటి పుండ్లను తగ్గిస్తుంది. పొట్టలోని గ్యాస్ ను తగ్గిస్తుంది.
ఈ పండ్లు వినాయక చవితి నుండి వేసవి వరకు లభిస్తాయి.