రాజస్థాన్ లోని అంబర్ పాలకుడైన రాజా మాన్ సింగ్ లాహోర్ నుండి మీనాకారి కళాకారులను రాజస్థాన్ కు రప్పించాడు. ప్రస్తతం జైపూర్ మీనాకారి ఆభరణాలకు ప్రసిద్ధి చెందినది. మీనాకారి ఆభరణాల తయారి అత్యంత కళాత్మకంగా, సునిసితంగా ఉంటుంది. ఆకులు, పువ్వులు, పక్షులు, విభిన్న రంగులతో పెయింటింగ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా వీటిని రూపొందిస్తారు.
ముందుగా కావలసిన డిజైన్ ను ఏదైనా లోహంపై మలచి, రంగులు అద్దుతారు. నిండు రంగుల ఎనామిల్ డస్ట్ ను చెక్కిన డిజైన్ లో నింపుతారు. మీనాకారి పనితనం కళ్లకింపుగా ఉంటుంది. ప్రధమంలో మీనాకారి కళను మొగల్ చక్రవర్తులు తమ భవనాల అలంకరణకు వాడుకునేవారు. క్రమంగా ఈ పనితనం ఆభరణాలకు వచ్చింది.
అందానికి ప్రతిరూపం, ఏ వస్త్రధారణకైనా సరిపోతాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను మీనాకారి ఆభరణాలు ప్రతిబింబిస్తాయి. బంగారం, వెండి ఇంకా వివిధ లోహాలతో ఈ ఆభరణాలు తయారవుతాయి.