కెంపు, పచ్చ, ముత్యం, పగడం, వజ్రం, వైఢూర్యం, నీలం, పుష్యరాగం, పిల్లికన్ను రాయిలతో రూపొందించిన వాటినే నవరత్న ఆభరణాలు అంటారు. నవరత్నాలతో ఉంగరాలు, బ్రేస్ లెట్లు, నెక్లెస్ లు, చెవిదిద్దులు తయారవుతున్నాయి.
ప్రాచీన భారతంలో మహారాజులు, వారి కుటుంబీకులు ఎక్కువగా వీటిని ధరించేవారు. ప్రస్తుతం ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. భారతీయు వీటిని ధరిస్తే జాతకరీత్యా అదృష్టం అని భావిస్తారు. జాతక చక్రాలతో ఇవి అనుసంధానమై ఉంటాయి.
నవరత్న ఆభరణాలు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనవి.