అన్ని సంధర్భాలలో, అతివలందరూ ధరించగల ఆభరణాలు ముత్యాల ఆభరణాలు. పాతతరం నుండి నేటి తరం వరకు అభిమానించేవి ముత్యాల ఆభరణాలు.
ముత్యపు చిప్పల నుంచి సహజంగా తయారైన ముత్యాలు తెలికగా చూడముచ్చటగా ఉంటాయి. ముత్యాలను బంగారంతో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఫ్యాషన్ ప్రపంచంలో వీటి స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. పురాతన కాలం నుండి భారతదేశంలో ముత్యాలు ధరించే వారు.
ముత్యాలు కోడి గుడ్డు ఆకారంలోనూ, గుండ్రంగానూ ఉంటాయి. సహజంగా సముద్రంలోనూ, మంచినీటిలోనూ ముత్యపు చిప్పల ద్వారా లభించే ముత్యాలు చాలా ఖరీదైనవి. ముత్యాలను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి.
మార్కెట్ లో నకిలీ ముత్యాలు కూడా ఉన్నాయి. సహజమైన మంచి ముత్యాలను కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. ముత్యాన్ని వేళ్లమధ్య ఉంచుకొని ముందు పళ్లవరుసమీద సున్నితంగా రుద్దాలి. మంచి ముత్యాల ఉపరితలం కొంచెం గరుకుగా ఉంటుంది.