header

How to find pure gold…స్వఛ్చమైన బంగారాన్ని ఎలా కనిపెట్టాలి...?

How to find pure gold…స్వఛ్చమైన బంగారాన్ని ఎలా కనిపెట్టాలి...?
బంగారం కొన్న తరువాత ఇంట్లోనే కొన్ని ప్రయోగాల ద్వారా ఫేక్ బంగారాన్ని కనిపెట్టవచ్చు. బంగారపు వస్తువు మీద గుర్తుకోసం ఒక చీన్నగీత పెట్టండి. ఆ గీతమీద ఒక చుక్క నైట్రిక్ యాసిడ్ వేయండి. కొద్దిసేపు ఆగండి. బంగారం నకిలీదైతే గీత ఉన్న చోట పచ్చగా మారుతుంది.
గీత ఉన్న చోట పాలరంగులోకి మారితే ఆ బంగారంలో వెండి ఎక్కువగా కలిసి ఉంటుంది. గీత ఉన్నచోట రంగు మారకుండా ఉంటే అది నాణ్యమైన బంగారం.
స్వచ్ఛమైన బంగారం ధరించినపుడు చర్మానికి ఏ విధమైన ఎలర్జీ రాదు. బంగారంలో ఎక్కువగా కల్తీ జరిగితే ధరించిన చోట ఎలర్జీ వచ్చి చర్మం నల్లగా మారుతుంది.
24 K : 24 పాళ్ళకు 24 పాళ్లు ఉన్న బంగారాన్ని 24K గోల్డ్ అని అంటారు -99.9 (999)
22 K : 24 పాళ్ళకు 22 పాళ్లు ఉన్న బంగారాన్ని 22K గోల్డ్ అని అంటారు -91.7(916/997)
18 K : 24 పాళ్ళకు 18పాళ్లు ఉన్న బంగారాన్ని 18K గోల్డ్ అని అంటారు -75 (750)
14 K : 24 పాళ్ళకు 14పాళ్లు ఉన్న బంగారాన్ని 14K గోల్డ్ అని అంటారు -56.3 (500)
ఇంకా 10K, 9K రకానికి చెంది బంగారంలో బంగారం తక్కువ పాళ్లు ఇతర లోహాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బంగారు నగ మీద ఎక్కడో ఒకచోట అమ్మిన సంస్థ లోగో మరియు బంగారం ఎన్ని కేరెట్లకు చెందినదో ముద్ర ఖఛ్చితంగా ఉంటుంది. పాత కాలపు నగలమీద ఈ చిహ్నాలు ఉండకపోవచ్చు.