.
ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.
బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది.
ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన అనుభవాన్ని పెంచుకున్నాడు. 13 శతాబ్ధాలుగా బాణభట్టు వాజ్ఙ్మయ రచయితగా అత్యున్నస్థానంలో ఉన్నాడు
బాణుడు అర్ధ, కామ, రాజనీతి, అలంకా శాస్త్రాలను అభ్యసించాడు. భారతదేశంలో పేరుపొందిన రాజులలో హర్షవర్ధనుడు ఒకడు. ఇతని రాజధాని స్థానేశ్వరం. హర్షవర్ధనుడు బాణభట్టుని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆస్థానపండితుడిగా నియమించి గౌరవించాడు.
తదుపరి కాలంలో బాణుడు హర్షచరిత్ర, కాదంబరి అనే అనే గ్రంధాలను రచించాడు. చండికా శతకం మరియు పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు.
వీటిలో హర్షచరిత్ర, కాదంబరి గ్రంథాలు అసంపూర్తిగా రచింపబడ్డాయి. తరువాత ఇతను కుమారుడు భూషణభట్టు ఈ రెండు గ్రంథాలను తండ్రిశైలిలోనే పూర్తిచేసి పండితుల ప్రశంసలు అందుకున్నాడు.