సుప్రసిద్ధ సంస్కృత నీతిశతక కర్త, పాటలీపుత్ర నివాసి. భర్తృహరి గురించి విభిన్నవాదనలున్నాయి. విక్రమార్కుని సొదరుడని, రాజ్యాధికారం వచ్చి రాజైన తరువాత రాజ్యం త్వజించాడని అంటారు.
భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతిలోని నీతిని, శృంగారాన్ని, వైరాగ్యాన్ని బోధించే మూడు శతకాలున్నాయి. .
సంస్కృతంలోని ఈ నీతి శతకాలు బహుజనాదరణ పొందాయి. తెలుగులో ఎలకూచి బాల సరస్వతి (1610-1670) ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మన్న (1750-1800) అనే ముగ్గురు కవులు భర్తృహరి శతకాలను అనువదించారు. వీటిలో ఏనుగు లక్ష్మణకవి అనువాదమే భర్తృహరి సుభాషితాలుగా బహుళ ప్రజాదరణ పొందింది.