header

Bharavi…భారవి

Bharavi…భారవిి
ప్రముఖ సంస్కృత మహాకవి. సంస్కృత పంచ మహాకావ్యాలలో ఒకటి అయిన కిరాతార్జునీయం కర్త. మహాభారతం నుంచి గ్రహించబడిన కథ దానిలోని ఇతివృత్తం. ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేయడం, కిరాత రూపంలో వచ్చిన శివునితో యుద్ధం చేసి ఆయనను ప్రసన్నుణ్ని చేసికొని ఆయన వలన పాశుతతాస్త్రాన్ని పొండం దీనిలోని ప్రధానమైన కథ. ఈ చిన్న కథనే భారవి 18 అశ్వాసాల మహాకావ్యంగా రసవత్తరంగా తీర్చి దిద్దాడు. .
భారవి కవిత్వంలో అర్ధగౌరవం ప్రధానంగా కనిపిస్తోంది. భారవి తనకావ్యంలో 24 విధాల వృత్తాలను వాడటం జరిగింది. .
కిరాతార్జనీయ కావ్యానికి ఎందరెందరో వ్యాఖ్యానాలు రచించారు. మల్లినాధ సూరి వ్రాసిన ‘ఘంటాపథ’ వ్యాఖ్యానమే మిక్కిలి పేరు పొందినది