Bhasudu…భాసుడు
సంస్కృతంలో రంగస్థల ప్రదర్శన యోగ్యమైన నాటకాల రచనకు ఆద్యుడు. కాళిదాసు కంటే కూడా పూర్వుడు. సంస్కృతంలో ఈయన 13 నాటకాలు వ్రాశాడు. వాటిలో పేరుపొందినవి స్వప్న వాసవదత్త, ప్రతిమా నాటకం. భాసుడి నాటకాలను మూడు వర్గాలుగా విభజించారు. .
రామాయణానికి సంభందించినవి – ప్రతిమ, అభిషేక నాటకం, యజ్ఞఫలం. మహాభారత కథకు సంభందించినవి – పంచరాత్రం, దూతవాక్యం, మధ్యమ వ్యాయోగం, దూత ఘటోత్కచం, కర్ణభారం, ఊరుభంగం, బాల చరితం. ఇతర కథల మీద ఆధారపడినవి – స్వప్న వాసవదత్తం, చారుదత్తం, అవిమారకం. భాసుడు కాళిదాసు చేత కూడా గౌరవంగా స్మరించబడిన సంస్కృత మహానాటక కర్త.