Bhavabhooti…భవభూతి
సంస్కృతంలో కాళిదాసుతో సమానంగా ప్రశంసలందుకున్ మహాకవి భవభూతి. విదర్భ దేశంలో పద్మపుర నివాసి. సాంఖ్య, యోగ వ్యాకరణ, తర్క, అంకార, వేదాంత శాస్త్రాలలో భవభూతి నిధి. .
కన్యాకుబ్జ రాజైన యశోవర్మ ఆస్థానకవి భవభూతి.సంస్కృతంలో ఈయన మూడు నాటకాలను రచించాడు. అవి ఉత్తరరామ చరిత్ర, మహావీర చరిత్ర, మాలతీ మాధవం. .
వీటిలో ఉత్తరరామ చరిత్ర ప్రశస్తమైన రచన. కరుణ రస ప్రధానమైన ఈ నాటకంలోని శ్లోకాలెన్నో ప్రజల నాలుగులమీద నాట్యం చేస్తున్నాయి. ‘‘అపిగ్వారోదితి, అపిదళతి వజ్రస్య హృదయం’’ అని సీతమ్మ దుఃఖాన్ని వర్ణిస్తాడు. ఆమె దుఃఖానికి శిలలు కూడా విలపించాయట. వజ్రహృదయం కూడా విచ్చిపోయిందట. ‘‘ఏకోరసః కరుణ ఏవ’’ అని సాహిత్యంలో కరుణరస ప్రాశస్త్వాన్ని భవభూతి చాటాడు.