ప్రముఖ భారతీయ తర్కమీమాంస శాస్త్రవేత్త. కొన్నాళ్లు బౌద్ధం అవలంభించి ఆ మత రహస్వాలు తెలుసుకొని మరల హిందూమతంలోకి వచ్చి అనేక బౌద్ధుల హత్యకు కారణ భూతుడయ్యాడని అంటారు.
ధర్మకీర్తి ఈయనకు బౌద్ధ దీక్ష ఇచ్చాడంటారు. జైమిని వ్రాసిన పూర్వ మీమాంసా సూత్రాలమీద శబరస్వామి రచించిన భాష్యానికి కుమారిలభట్టు విపుల శ్యాఖ్య వ్రాశాడు. ఇది శ్లోకా వార్తకం, తంత్ర వార్తికం, టిప్ టీక అని మూడు భాగాలుగా ఉంది. .
మధ్యాచార్యులు తన ఆప్తమీమాంసా కృతి అనే గ్రంధంలో కుమారిలభట్టు తెలుగువాడని తెలిపాడు. .
జీవితం చివరి రోజులలో ఈయన ఒక కన్నుకో కోల్పోవటం గురించి తిరిగి హిందూమతం స్వీకరించడాన్ని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శంకరాచార్యుల వారు కుమారిలభట్టును దర్శించాలని వెళ్లగా అప్పటికే బౌద్ధ గురువులకు అన్యాయం చేశాననే పశ్ఛాత్తాపంతో కుమారిలభట్టు తుషాగ్ని (ఊకతో చేసి నిప్పు)లో కాలుతున్నాడట. శంకరాచార్యుల వారి ప్రార్ధన కూడా మన్నించకుండా, తన శిష్యుడైన మండన మిశ్రుని వద్ద పూర్వమీమాంసా సిద్ధాంతలను .
గ్రహించవలసిందని శంకారాచార్యులని ఆదేశించి కుమారులభట్టు దేహత్యాగం చేశాడంటారు.