సంస్కృత భాషలో కవికుల గురువు, ప్రపంచంలోనే ఆగ్రశ్రేణి కవులలో ఒకరుగా పరిగణించబడుతున్న మహాకవి కాళిదాసు.
క్రీ.శ. ప్రధమార్ధం వాడని, 4 వ శతాబ్ధానికి చెందినవాడని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్రమార్కుని ఆస్ధానంలో వాడని, భోజరాజు ఆస్థానంలో వాడని మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్కమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడని చరిత్రకారులు భావిస్తున్నారు. .
కాళిదాసు రచించిన కావ్యాలలో ప్రధానమైనవి ఋతు సంహారం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం. .
పురాకవీనాం గణన ప్రసంగే.
కనిష్ఠికా ధిషిటత కాళిదాసః.
అద్యాపి తత్తుల్య కావే రభావాత్.
అనామికా సార్ధ వతీ టూవ.
మన చేతివ్రేళ్లలో ఉంగరపు వ్రేలును సంస్కృతంలో అనామిక (పేరులేనిది) అంటారు. ఆ వ్రేలు అనామిక అనడానికి కారణం పూర్వ మహాకవులను లెక్కపెడుతూ మొదట కాళిదాసు అని చిటికెన వ్రేలు ముడిచారట. అంత గొప్పకవి మరి కనిపించకపోవటం వలన ప్రక్కనున్న ఉంగరపు వ్రేలును ముడవటం కుదరలేదట. అందుచేత ఆ వ్రేలు అనామిక అయింది. భారతీయులు కాళిదాసు మహాకవికి ఇచ్చే గౌరవ స్ధానాన్ని ఈ శ్లోకం చాటుతుంది