శూద్రకుడు సంస్కృత మహాకవి. ప్రసిద్ధమైన ‘‘మృచ్ఛకటిక’’ నాటకాన్ని రచించిన వాడు.
అనంత మహాకవి తన వీర చిరితలో శూద్రకుడు బ్రాహ్మణుడనియు, శాలివాహన చక్రవర్తికి మిత్రడనియు, శాలివాహనుడు, అతని కుమారు మరణించిన పిమ్మట శూద్రకుడే ఉజ్జయినీకి రాజైనాడని అంటారు.
మృచ్ఛకటికంలో 10 అంకాలున్నాయి. మహాకవి రచించిన చారుదత్తం దీనికి మూలం. ఒక సాధారణ వేశ్వను కూడా ఉదాత్త నాయకిగా పేర్కొనటం ఈ నాటకంలోని విశేషం.
సంస్కృతంలో వచ్చిన నాటకాలలో ఈ నాటకం ఉదాత్తమైనది. తిరుపతి వెంకటకవులు ఈ నాటకాన్ని తెలుగులోనికి అనువదించారు