సుప్రసిద్ధ సంస్కృత అలంకారికుడు, ప్రతాపరుద్రీయ కర్త. విద్యానాధుడు ఇతని బిరుదనామమని అసలు పేరు అగస్త్యుడని కొందరి అభిప్రాయం. కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుని ఆస్ధాన విద్యాంసుడుగా ఉంటూ ప్రతాపరుద్రీయ యశోభూషణం అనే అలంకార గ్రంధం వ్రాసి ఆయనకే అంకితం చేశాడు. .
ఈ లక్షణ గ్రంధంలోని లక్ష్యాలన్నీ ప్రతాప రుద్రుణ్ణి వర్ణస్తూ వ్రాసినవే. కావ్య, గుణ, దోష, అలంకార శాస్త్రం బహుళంగా వ్యవహారంలో ఉండిన ఉద్గ్రంధం. ఈ అలంకార శాస్త్రం గ్రంధానికి రత్నాపణం అని ఒకటి. రత్నశాణం అని ఇంకొకటి రెండు ప్రముఖ వ్యాఖ్యానాలున్నాయి. సుప్రసిద్ధ సంస్కృత కావ్య వ్యాఖ్యాత మల్లినాధ సూరి కుమారుడైన