బమ్మెరపోతన 15వ శతాబ్ధంలో వరంగల్ జిల్లాలోని బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసి జీవించేవాడు. తన ప్రధమ రచన ‘‘భోగినీ దండకం’’ అనే కావ్యాన్ని సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవదార్పణం గావించాడు.
పోతన కవి, కవిసౌర్యభౌముడైన శ్రీనాధునికి సమకాలికుడు మరియు బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ’’ఆంధ్రామహాభాగవతం‘‘ అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభ్రదవిజయము, నారాయణ శతకం మొదలగునవి. ఆంధ్రసాహిత్యంలో పోతనామాత్యుడు చిరంజీవి. పోతన జన్మస్థలం బమ్మెర కానీ చాలాకాలం కడపలోని ఒంటిమిట్టలో నివసించాడంటారు. అతని కాలంనాటి ఒంటిమిట్ట శ్రీరామాలయం చాలా ప్రసిద్ధి పొందినది. ఇక్కడనే పోతన భాగవతాన్ని తెలుగులో వ్రాశాడంటారు.