జయదేవుడు క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఒరిస్సాలోని పూరీ జగన్నాధం దగ్గర కిందుబిల్వ గ్రామం నందు జన్మించారు. ఇతను ఒక సంస్కృత కవి మరియు రచయిత. తండ్రి భోజ దేవుడు, తల్లి రాధాదేవి. చిన్నతనం లేనే తల్లితండ్రులు చనిపోయారు. ఇతని భార్య పద్మావతి.
జయదేవ కవి, లక్ష్మణశేన మహారాజ ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి పొందారు. ఒక రోజు రాత్రి లక్ష్మణశేన మహారాజ భార్య ఐన మహరాణి జయదేవ కవిపై అతని భార్య పద్మావతి కి ఎంత ప్రేమ వుందో పరీక్షించాలనుకొని, ఒక అబద్ధం ఆడింది. "పద్మావతి, జయదేవ కవి మహారాజు వెంట వేటకి వెళ్ళి అక్కడ అరణ్యంలో క్రూరమృగం దాడిలో మరణించాడు." అని తెలుపుతుంది. ఇది విన్న పద్మావతి వెంటనే కూలిపోయి మరణిస్తుంది.
దుఖసాగరంలో మునిగిన జయదేవ కవి, రాజాస్థానం వదిలి కేందులు అనే గ్రామానికి వెళతాడు. ప్రస్తుతం జయదేవ కవి సమాధి అక్కడే ఉంది.
జయదేవ కవి రచించిన గీత గోవిందం మిక్కిలి ప్రశస్తి గాంచినది. ఈ కావ్యాన్ని అష్టపదులు అని కూడా అంటారు. గీత గోవిందంలో మొత్తం ఇరువది నాలుగు అష్టపదులు ఉన్నాయి.