తుకారాం జీవితకాలం 1608 నుండి 1649 వరకు. మహారాష్ట్ర పూనేలోని దేహూ అనే గ్రామంలో జన్మించాడు. మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. విఠోబా (పాండురంగడు)ను పూజించే వాడు. ఇతడు తక్కువజాతికి చెందిన వాడంటారు. ఇతని ఆద్యాత్మిక గురువు బాబాజీ చైతన్య. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. తుకారాం మొదటి భార్య రుక్మాబాయి కుమారుడు సంతు అప్పట్లో వచ్చిన కరువుకు బలైపోతారు. తరువాత జిజియాబాయి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారు. వీరు మహదేవుడు, విఠోబా, నారాయణ అనే మరియు భాగీరథి అనే కూతురు.
తుకారం శివాజీని కలసిశాడంటారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడంటారు. శివాజీ గురువైన రామదాసును కూడా తుకరాం శివాజీకి పరిచయం చేశాడంటారు భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం
తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహూ గ్రామంలోనే నివసించాడు. ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గర్లోని చిన్న పట్టణం.
సాధువులు దీపావళి, దసరా పండుగలలో మన ఇండ్లకు వస్తారు. వారి రాక వైకుంఠం కలివచ్చినట్లే వుంటుంది.
మనసుకు కొంచెంగా దైవభక్తి రుచి గనుక చూపిస్తే అది దానిని ఇంక వదలనే వదలదు.
విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, అది అక్కడే పూజలందుకుంటుంది.
దశరథ పుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా, ఆత్మారాముడు శాశ్వతుడు.