header

Gnaneswar

జ్ఞానేశ్వరుడు
gnaneswar జ్ఞానేశ్వరుడు 13 శతాబ్ధానికి యాదవ రాజైన రామదేవర పరిపాలిస్తున్న కాలానికి చెందిన వాగ్గేయకారుడు, తత్వవేత్త. తండ్రి విఠల్ పంత్. మహారాష్త్రలోని పూనాలోని చిన్నగ్రామమైన అలందిలో 1271 సంవత్సరంలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరులు నివృతినాధ్, సోపాన్ దేవ్, ఒక సోదరి ముక్తా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇతడు నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి. భగవద్గీత మీద ఆయన రచించిన జ్ఞానేశ్వరి అనే గ్రంథం, అమృతానుభవం అనే గ్రంథం మరాఠీ సాహిత్యంలో మైలురాళ్ళుగా చెబుతారు.
యాదవ రాజుల పాలనలో కళలు, సైన్సు మొదలైన రంగాలు బాగా అభివృద్ధి సాధించాయి. భారత దేశం నలుమూలల నుంచి అనేకమంది పండితులు ఆ రాజ్యానికి విచ్చేసేవారు. కానీ అదే సమయంలోనే ప్రజల్లో మతమౌఢ్యం, సాంఘిక దురభిమానం, మూఢ నమ్మకాలు లాంటివి పెరిగి గ్రామదేవతలకు మూగజీవాలను బలి ఇవ్వడం ఎక్కువైంది. జ్ఞానేశ్వరుడు తను రాసిన జ్ఞానేశ్వరి అనే గ్రంథంలో ఈ మూఢాచారాలను విమర్శించాడు.
మరాఠీలో రచనలు చేసిన తొలి తత్వవేత్త జ్ఞానేశ్వరుడు