గోరా కుంభార్ కూడా మహారాష్ట్రకు చెందిన వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖుడు. వీరిని సంత్ లుగా పిలుస్తారు. భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. జన్మతః కుమ్మరి వంశఃస్థుడు. విఠలునికి పరమ భక్తుడు.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని గోరాబాలోని సత్యపురిలో నివసించాడని చాలామంది అభిప్రాయం. మరియు నామదేవునికి సమకాలికుడని కూడా అంటారు. క్రీ.శ.1267 నుండి 1317 వరకు ఇతని జీవితకాలమని కొన్ని ఆధారాలవలన తెలుస్తుంది.
ఇదే గ్రామంలో ఇతని పేరుమీద చిన్న దేవాలయం ఉంది. భక్తులు వస్తుంటారు.