header

Namadevudur

నామదేవుడు
నామదేవుడు క్రీ.శ.1270 – 1350 కాలానికి చెందినవాడు. కానీ స్పష్టమైన మాచారం లేదు. విభిన్న అభిప్రాయాలున్నవి. నామదేవుడు మహారాష్ట్రకు చెందిన వాగ్గేయకారుడు. నామదేవుడి తల్లి గోనాయ్. నామదేవుడు మహారాష్ట్రకు చెందిన వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖుడు. విఠలుని పరమ భక్తుడు.
నామదేవుడు వైష్ణవ సాంప్రదాయంచే ప్రభావితం అవుతాడు. ఆయన రాసిన అనేక గీతాలు, భజన పాటలుగా ప్రాచుర్యం పొందాయి. ఆయన పాటల్లో ముఖ్యంగా ఏకేశ్వరోపాసన, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మతత్వాలు కనిపిస్తాయి. మిగతా గురువులతో కలిసి ఆయన ప్రారంభించిన వర్కారీ సాంప్రదాయం ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సాంప్రదాయం ప్రకారం దక్షిణ మహారాష్ట్రలో సంవత్సరానికి రెండు సార్లు భక్తులు సామూహికంగా పండరీపురానికి పాదయాత్ర చేస్తారు
నామదేవుడికి రాజాయ్ అనే ఆమెతో వివాహం అయింది. వారికి విఠ అనే కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ, మరియు నామదేవుడి తల్లి గోనాయ్ ఆయన గురించి రాశారు. ఆయన సమకాలికులైన ఒక శిష్యుడు, ఒక గురువు, ఒక కుమ్మరి (కుంభార్ గోరా) కూడా ఆయన గురించి ప్రస్తావించారు. అయితే అప్పటి పాలకులు మాత్రం వారి రికార్డులలో, శాసనాలలో ఈయన గురించి ఎక్కడా తెలుపలేదు. వర్కారీ సాంప్రదాయం కాని వాళ్ళ రచన, మహానుభవ సాంప్రదాయానికి చెందిన 1278 లో రాయబడిన లీలా చరిత్ర అనే గ్రంథంలో ఆయన ప్రస్తావన ఉంది. ఇంకా 1310లా రాయబడిన స్మృతిస్థల అనే మహానుభవ సాంప్రదాయ గ్రంథంలో కూడా నామదేవుని గురించి కొంత సమారారం లభించింది. దీని తరువాత 1538లో రాయబడిన మరాఠీ చరిత్ర భకర్ అనే గ్రంధంలో మాత్రమే ఆయన గురించి ప్రస్తావన ఉంది
పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత మరాఠా దేశంలో నామదేవుడు ప్రముఖ పాత్ర పోషించిన మరాఠీ భక్తి ఉద్యమం పునరుత్తేజం పొందింది