తూము నరసింహదాసు భక్తరామదాసు శిష్యునిగా పేరుపొందాడు. భక్తరామదాసు సమకాలికుడు. వీరి స్వస్థలం మాత్రం గుంటూరు. ఇక్కడనుండి యాత్ర చేస్తూ భధ్రాచలం చేరుకున్నారు. సంస్కృత సాహిత్యంలోనూ, సంగీతంలోనూ పండితుడు.
ఇతని సాంప్రదాయ కీర్తనలు, మేలుకొలుపు పాటలు, మంగళహారతులు, లాలిపాటలు, భజనకీర్తనలను రచించి గానం చేసాడు. ఇతని తెలుగు భాషా మాధుర్యానికి మురిసిపోయిన తమిళకవి సుబ్రమణ్య భారతి వింటే తెలుగు పాటే వినాలని అన్నారట.
ఈయన రచించి కీర్తనలు నేటికి భజకూటములలో, సాంప్రదాయాలు పాటించే ఇళ్లలో నేటికీ వినబడుతున్నాయి. వీరు మిత్రబృందంతో, కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు దర్శించారు. శ్రీరంగం, కంచి దేవుళ్లపై పాటలు పాడాడు. చివరకు భద్రాచలం చేరుకుని తన నిత్యసంకీర్తనలతో స్వామిని సేవిస్తూ స్వామిలో ఐక్యం అయ్యాడని చెబుతారు.
ఈయన తన శిష్యుడైన వరద రామదాసు కలసి తమ సంపదను రామసేవకు అర్పించారు. వరద రామదాసు కూడా గొప్ప రామభక్తుడు. ఈయన క్షయవ్యాధితో మరణించినపుడు ఈయన భౌతిక కాయాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేసారు. ఈయనను నిమజ్జనం చేయటానికి వెళ్లిన తోటివారు కూడా గోదావరిలో మునిగి దేహత్యాగం చేసారు.
తూము నరసింహదాసు రచించి గానం చేసిన కొన్ని పాటలు:
భజన చేసే విధము తెలియండి మీరు జనులారా....
కావేటి రంగా నను గావవేరా....
వందనమిదే శ్రీరంగా....
వరదుని గంటి కంచి వరదుని గంటి.....