శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 1894లో మే 20వ తేదీన జన్మించారు. నడిచే దేవుడిగా పిలవబడిన కంచీపుర శంకరమఠానికి 68వ జగద్గురువు, పీఠాధిపతులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి భారత పురాతన సాహిత్య సాక్షాత్కారంగా, ప్రాచీన విజ్ఞాన ఆవిష్కరణగా గుర్తింపు పొందారు. వీరి మేధస్సు, నిరాడంబర జీవితం ఎంతో కీర్తి పొందాయి. వేదాలపై సనాతన ధర్మ సూక్ష్మాలపై వీరు చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు చాలా విలువైనవి. ప్రేమతో ఇతరుల హృదయాలు జయించాలని వీరి ఉవాచ.