header

Gurunanak

గురునానక్
గురునానక్ శిక్కుమత వ్యవస్ధాపకుడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. తృప్త, మెహతా కలు ఇతడి తల్లిదండ్రులు.
ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈ రోజు మనం నన్‌కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నారు. పసితనం నుండీ నానక్‌కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుండీ మరొక చోటుకీ పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను ప్రయాణం చేశాడు. అతడు భగవంతుడిని వాహేగురు అని పిలిచాడు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ "మానవాళి గురుగు"గా అభివర్ణించాడు.
హిందూ, ముస్లింలే కాకుండా వివిధ మతాల మధ్య సమన్వయతకు పాటుపడ్డారు. గరుకాలంగర్ అనే సామూహిక వంటశాలలు ప్రారంభించారు.
గురు నానక్ బోధనలన్నిటినీ గురుగ్రంధ సాహిబ్ , ఆదిగ్రంధ్ లో సంకలనం చేశారు. క్రీ.శకం 1539 సం.లో పరమపదించినారు. గురునానక్ తదనంతరు శిక్కులు సిక్కుమతంగా రూపాంతరం చెందారు.
గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు
• బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము.
• భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు.
• ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.
• దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి.
• ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగల్గే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు.
• అందరూ గొప్ప పుట్టుక కలవారే.
• పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.
• అర్ధంలేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్ధం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి.
• పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.