స్వామి అసంగానంద మళయాళస్వామిగా ప్రసిద్ధుడు. పరివ్రాజకునిగా భారతదేశంలోని అన్నిపవిత్ర ప్రదేశాలను సందర్శించారు. చివరకు తిరుపతి దగ్గర ఏర్చేడులో ఆశ్రమం స్థాపించాడు. ఒక చుక్క విషం కడివెడు పాలను పాడుచేసినట్లే ఒక్క పాడు ఆలోచన మనిషిని పతనం చేస్తుందని మాటను, హృదయాన్ని ఒక్కలాగే ఉంచుకోవటం కంటే గొప్ప తపస్సు లేదని అంటారు. జ్ఞానం వలన మోక్షం వస్తుంది. జ్ఞానానికి మార్గం ఆరాధన. ఫలితం మీద ఆశలేని వారికే సాధ్యం అవుతుంది అంటారు మలయాళస్వామీజి.