19వ శతాబ్ధంలో కేరళ రాష్ట్రంలో ఎన్నో మార్పులు, సాంఘికంగా, ఆర్ధికంగా, మేధాపరంగానూ సంభవించటం జరిగింది. ఆ కాలంలో నారాయణ గురు భగవంతునికి మనుషులందరూ సమానమే అని ప్రభోదించాడు. నారాయణగురు తనకు భక్తిమార్గం కంటే, సాంఘిక చైతన్యమే ముఖ్యం అని భావించాడు. అంటరానితనానికి నిరసనగా అందరినీ అనుమతించే శివాలయాన్ని తానే నిర్మించాడు. ఆ గుడి గోడల మీద ఇక్కడ ప్రవేశం అందకరికీ సమానం. కులాలు, అసూయల గోడలె లేవు. ఇక్కడ హృదయపూర్వకంగా అందరూ సమానులే అని రాయించిన గొప్పవాడు.