పరమహంస యోగానందగా పేరు పొందిన ముకుందలాలా ఘోష్ 1893లో ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లో జన్మించాడు. కలకత్తాలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని 1910 ప్రాంతంలో గురువైన స్వామి శ్రీ యుక్తేశ్వర గిరిని కలవటం జరిగింది. 1917లో సన్యాసం స్వీకరించి స్వామి యోగానందగా మారాడు. ఇతను ప్రారంభించిన చిన్న పాఠశాల ఆ తరువాత మోగడ సత్సంగ్ అనే సంస్థగా పేరుపొందింది.
1920లో అమెరికాకు వచ్చిన పరమహంస అక్కడ తన పాశ్ఛాత్య శిష్యుల కోసం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను స్థాపించాడు. అలా పశ్చిమ వాసులకు క్రియాయోగ పరిచయం చేసిన వాడు స్వామి యోగానంద.
1946లో పరమహంస తన ఆత్మకథ ఒక యోగి ఆత్మకథను ప్రచురించారు. అది దాదాపు 18 భాషలలోకి తర్జుమా చేయబడింది. ఎంతో ఖ్యాతి గాంచినది.
యోగానంద 1952లో అమెరికాలో పరమపదించినా అతని పార్ధివదేహం కూడా స్వచ్ఛంగా, మామూలుగా ఉండటం మరణించిన సూ,నలు కనిపించకపోవటం అక్కడి వైదుయలను ఆశ్చర్యపరచింది. ఈ విషయం శివపరీక్ష నివేదికలో అక్కడి వైద్యులు నమోదు చేశారు.