శ్రీరాముడు ధర్మస్వరూపుడు. శ్రీకృష్ణుడు ధర్మ సంరక్షకుడు. శ్రీరామకృష్ణ పరమహంస సర్వధర్మస్వరూపంగా పరిగణించబడినాడు. వివేకానందుడు ఇతని ప్రియతమ శిష్యుడు.
సామాన్య పూజారిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఇతను కాళీమాత ఉపాసనతో, అనుగ్రహంతో సర్వధర్మసారాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆదర్శపురుషుడిగా వెలుగొందినాడు. ఈయన పేరుమీద నేడు రామకృష్ణ మిషన్ ఎన్నో ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్య్రక్రమాలను నడుపుతూ ప్రపంచమంతా వ్యాపించింది.
శ్రీరామకృష్ణుల వారు 1836లో జన్మించారు. 1885లో పరమపదించారు. వీరి సతీమణి శ్రీ శారదాదేవి. ఈమే శారదామాతగా ప్రసిద్ధి పొందినది. ఎందరో ఆధాయత్మిక సాధువులకు తల్లిగా, వారి ఎదుగుదలకు కారణమై ఇప్పటికి పూజింపబడుతున్నది.