header

రమణ మహర్షి/ Ramana Maharshi

రమణ మహర్షి
రమణ మహర్షిగా పేరుబడ్డ వెంకటరమణ 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మించాడు. ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చు లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.
ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు
ఇతనికి 16 సంవత్సరా వయసులో మరణభయం పట్టుకుంది. ఒంటరిగా ఉన్న తనకు చావుతప్పదనే భావించాడు. తాను మరణించి నట్లు, దహన సంస్కారాలు జరిగినట్లు భ్రమచెందేవాడు. తన మనసులో తన దహనాన్ని చూచిన అతనికి నేను నా దహనక్రియను చూడగలిగాను అంటే ఎవరు మరణించినట్లు ? అన్న ప్రశ్న కలిగింది. దీనితో అతని ఆలోచనలలో నేను ఎవరు? నేను శరీరమా ? లేక శరీరాన్ని ధరించిన జీవమా? అన్న చర్చ ప్రారంభమయింది.
ఈ ఆధ్యాత్మిక భావనలతో నిండి ఇతడు విద్యపై ఆశక్తిని కోల్పోయాడు. దీనితో అతని ఉపాధాయయుడు అతనికి ఇంపోజిషన్ ఇచ్చి రాయమని చెప్పాడు. దీనితో పుస్తకాలు విడచి రమణ తన మార్గాన్ని అన్వేషిస్తూ ఇల్లువదలాడు.
తిరువణ్ణామలైలోని అరుణాచల ఆలయంలో భగవంతునికి తనను తాను అర్పించుకుని, ఒక నేలమాళిగలో 60రోజులపాటు ధ్యానంలో ఉండిపోయాడు. ఆతరువాత విరూపాక్ష గుహలలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయిన మహర్షి 11 సంవత్సరాల తరువాత తొలిసారిగా గణపతి మునితో నేనెవరు? అంటూ మాట్లాడటం జరిగింది. ఈ నేనెవరు అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షించింది.
ఒకసారి ఓ విదేశీ భక్తుడు దేవుడనగానేమి ? అని అడుగగా చిరునవ్వుతో మహర్షి ఏది అతడో – అతడే దేవుడే అని చెప్పాడు అని చెప్పాడు. ఊరికే చర్చలతో కాకుండా అంతఃచేతనతో ఎవరికి వారు ముక్తిపొందాలని మహర్షి భావం.
వీరి రచనలలో ఉపదేశసారం, షట్ దర్శనం అనేవి ప్రఖ్యాతమైనవి.1950 ఏప్రిల్ 14 రాత్రి పరమపదించారు.