వేయి సంవత్సరాల క్రితమే ఆధ్యాత్మికత, మానవ విలువలు, సామాజిక సమానత్వం, శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం, విశిష్టాద్వైతం విశిష్టతను విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ధార్మిక ప్రచారం నిర్వహించారు శ్రీ రామానుజాచార్యుల వారు.
రామానుజాచార్యులు క్రీ.శకం 1017లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో జన్మించారు. క్రీ.1137లో పరమ పదించినారు. బాల్యం నుంచే ఇతను చాలా తెలివైన విద్యార్ధి. గురువుల బోధనలోని లోపాలు కనిపెట్టగల సామర్ధ్యం ఉండేది.
ఇతని భార్య చాదస్తం భరించలేక సన్యాసం స్వీకరించాడు. ఆ తరువాత శ్రీరంగంలో వైష్ణవ మఠాధిపతి అయినాడు.
గురువు రామానుజానికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి దీనిని చాలా రహస్యంగా ఉంచమని చెప్పాడు. అయితే వెంటనే రామానుజాచార్యులు గుడి వద్ద వర్గభేదం లేకుండా సకల జనులను సమావేశపరచి ఆ గుడి గోపురం ఎక్కి తనకు తెలిసిన మంత్రాన్ని అందరికీ బిగ్గరగా బోధించాడు.
అటుతరువాత తన చర్యకు బదులుగా ఈ మంత్రం వినటం వల్లా సకల జనులు స్వర్గం పొందగలిగితే, వారికి ఈ మంత్రం ఉపదేశించిన పాపానికి నేను నరకం భరించడానికి కూడా సిద్ధమే అని చెబుతాడు. అక్కడి హరిజనులందరికీ దేవాలయ ప్రవేశం కల్పించాడు.
. మెల్కొటెలో నిమ్నజాతీయులకు భగవత్ దర్శనం చేయించిన విప్లవవాది. తిరుమలలో వైఖానస ఆగమాన్ని గౌరవించి ఆ పద్దతులను కొనసాగించారు. ఇప్పటికీ తిరుమలలో రామానుజాచార్యుల వారు ప్రవేశపెట్టిన ఎన్నో సంప్రదాయపూజా పద్దతులు కొనసాగుతున్నాయి. దేవుడు, జీవుడు, ప్రకృతి వేర్వేరు అని ఆయన తన సిద్ధాంతాల్లో పేర్కొన్నారు. బాదరాయణుడి సిద్ధాంతాల మీద వ్యాఖ్యానం రాశారు. దీనినే శ్రీభాష్యం అంటారు. తన గురువైన యమునాచార్యుని మృతదేహానికి ఇచ్చిన మూడు హామీలు భాష్యం రాయడం, వైష్ణవమతప్రచారం, దేవాలయాన్ని నిర్మించడాన్ని (మెల్కొటెలో ఆలయ నిర్మాణం) నెరవేర్చాడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయప్రతిష్టాపన కూడా ఆయన నేతృత్వంలోనే జరిగింది. సాలగ్రామమయమైన తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు మోకాలి మిట్ట ప్రాంతంలో కాళ్లతో నడవకుండా మోకాళ్లతో నడిచిన మహా భక్తుడు ఆయన. అందుకనే ఇప్పటికి మోకాళ్ల మిట్ట అని పిలుస్తారు. భగవంతుని చేరుకోవాలంటే శరణాగతి కీలకమని చెప్పారు.
రామానుచార్యుల వారి సిద్ధాంతం విశిష్టాద్వైతం. బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం అనే వ్యాఖ్యాన గ్రంధాన్ని రచించారు.
వేదాంతసారం, వేదాంతదీపం, భగత్ రత్నాకార్, గీతా భాష్యం తదితర గ్రంధాలను రచించారు.
కుళోత్తుంగుని ఆగ్రహం వలన చోళ, చాళుక్య రాజ్యం విడచి హోయసల రాజ్యానికి వలస వెళ్ళాడు. ద్వైత, అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ బేధాబేధ సిద్ధాంతాన్ని రూపొందించిన నింభార్కునికి సమకాలీనుడు. నూట ఇరవై సంవత్సరాల తన జీవిత కాలంలో హైందవ దేవాలయాల విధి నిర్వహణ, పూజాదికాలను ససాంప్రదాయంగా నిర్ణయించిన ఘనత రామానుజులవారిదే