అస్సామ్ వాసులకు పూజ్య గురువు. ఇతను తన ఆశయాలను కథలు, పాటలు, అనువాదాల రూపంలో రచించాడు. భాగవతంలో చాలా భాగాన్ని కామరూపి అనే అస్సాంకు చెందిన జానపద భాషలోకి అనువదించటం జరిగింది. భక్తి తత్వాన్ని ప్రభోధించే భక్తి రత్నావళి ని రచించాడు. ఆరు నాటికలను అంకై – నట్ అనే పేరుతో రచించాడు. ఎన్నో కీర్తనలు స్వరపరచాడు. అస్సామీ ప్రాంతంలోని వీరి గీతాలు బార్ – గిట్స్ అని చాలా ప్రసిద్ధిపొందినవి. ఇతను భక్తి తత్యాన్ని ప్రబోధించాడు.