ఆర్య సమాజాన్ని స్థాపించి వేద ధర్మాన్ని పునఃప్రతిష్టించిన గురువర్యులు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వీరి అసలు పేరు మూలశంకర.
సత్యశోధనలో నిరతరం పరితపించిన వీరికి సరైన సమాధానం లభించలేదు. సన్యాస దీక్షకూడా అతనిలోని సత్యాన్యేషణకు సమాధానం ఇవ్వలేకపోయింది. చివరకు 1860లో మధురకు చెందిన ఒక ఆంధ్రా సాధువు, జ్ఞానవృద్ధుడు అయిన విరజానంద స్వామి అనుగ్రహం లభించింది. ఇతని చివరి జీవితకాలం అంతా ఆర్యసమాజం ప్రచారంతో గడచింది. దయానంద సరస్వతి స్వామి వేదాలకు భాష్యం కూడా రచించాడు.