header

స్వామి శివానంద / Swamy Sivananda

స్వామి శివానంద (1887-1963)
స్వామి శివానంద శరీరం కప్పుకోవటం కోసం దుస్తులు ధరించారు. జీవించటానికి భుజించారు. మానవసేవ కోసం జీవించారు.
1887సం. పట్టమడై తిరునల్వేలి (తమిళనాడు) లో జన్మించిన కుప్పుస్వామి (స్వామి శివానంద) చిన్నతనంలోనే త్యాగనిరతిని చాటాడు. తంజావూరు మెడికల్ స్కూల్ నుంచి ఉత్తీర్ణుడై 1913లో మలేషియాలో ఓ హాస్పటల్లో పనిచేయటాని వెళ్లారు. ఎంత క్లిష్టమైన జబ్బులనైనా నయం చేసేవాడు. స్వంత ప్రాక్టీసుతో బీదరోగులకు ఉచితంగా వైద్యం చేయటమే కాకుండా వారికి ఆర్థికంగా సహాయం చేసేవాడు.
ఒకసారి ఓ సిద్ధుడు జీవబ్రాహ్మణ్యం అనే పుస్తకాన్ని ఇతనికి ఇచ్చాడు. అది ఇతనిలో దాగిఉన్న ఆధ్యాత్మకతను వెలికి తీసింది.
ఒక దశాబ్ధం పాటు మలేషియాలో ఉండి, ఆ తరువాత రుషికేష్ కు తిరిగివచ్చి సన్యాసం స్వీకరించి స్వామి శివానందగా మారిపోయాడు. చాలాకాలం తపస్సు చేసిన తరువాత 1936లో డివైన్ లైఫ్ సొసైటీని ప్రారంభించాడు. దీని ద్వారా ఉపనిషత్ సారాన్ని ప్రచారం చేశారు.
ఎంతో చిన్నదిగా ప్రారంభమై దీనుల, ఆపన్నుల, నిస్సహాయుల సేవలో ఎదిగి నేడా సంస్థ అంతర్జాతీయ స్ధాయికి చేరుకుంది. స్వామి శివానంద 1953లో ప్రపంచ మత మహాసభలకు అధ్యక్షత వహించాడు. 1963లో మహాసమాధి పొందారు.