header

Tiruvalluvar / తిరువళ్లువార్

తిరువళ్లువార్
తిరువళ్లువర్ జీవితకాలం గురించి సరైన వివరాలు లభించటం లేదు. ఇతను కన్యాకుమారి రాజని, చేనేత కుటుంబంలో జన్మించాడని భిన్నాభిప్రాయాలున్నవి.
తమిళులకు ఆరాధ్యగ్రంధం తిరుక్కురల్ రచించాడు. దీనిని ముపృల్ అని కూడా పిలుస్తారు. అంటే త్రివర్గమని భావం. ఈ గ్రంథం ధర్మ, అర్ధ, కామమనే మూడు గుణాల గురించి వివరిస్తుంది. కనుక ఈ పేరు వచ్చింది. కురల్ అంటే చిన్న శ్లోకం వంటిది. తిరుక్కురల్ లో ఇలాంటివి 10 శ్లోకాలు ఒక భాగంగా మొత్తం 133 అధ్యాయాలున్నాయి.
ఈ గ్రంధంలో జీవితం, ప్రేమ, అదృష్టం, కుటుంబం, అనుబంధం, సత్యం, జ్ఞానం, భార్య, మంచిగుణం, అవకాశం, కర్మ వంటి ఎన్నో నిత్యజీవిత విషయాలు తెలుపబడ్డాయి. ఉదాహరణకు ఒక సజ్జనునికి దానగుణం, చిరునవ్వు, న్యాయబుద్ధి, మంచి పలుకులు ముఖ్యం అని అంటాడు తిరువళ్లువర్.