header

Vallabhacharyulu

వల్లభాచార్యులు (1473-1531)
వల్లభాచార్యుల వారు క్రీ.1479లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన మార్గం శుద్ధ ద్వైతం. భక్తిమార్గాన్ని పుష్టి మార్గం అంటారు. వల్లభాచార్యుల వారు రాధాకృష్ణుల మధుర భక్తిని ప్రభోదించారు. సిద్ధాంత రహస్యం, సుభోధిని తదితర గ్రంధాలను రచించారు. వల్లభాచార్యులు కృష్ణదేవరాయలకు సమకాలీనుడు.
ఆరు సంవత్సరాల వయసులోనే వేదాధ్యాయనం పూర్తిచేసి అనేక సార్లు తీర్ధయాత్రలు చేసిన గొప్పవాడు వల్లభాచార్యులవారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్ధానంలోని పండితులతో భక్తితత్వంపై ఎన్నో వాదనలు చేసి గెలిచినవాడు.
వల్లభాచార్యులవారు ప్రవచించినది శుద్ధాద్వైతం. ఈ మార్గంలో శ్రీకృష్ణుడే పరమమార్గంగా అందరూ భావిస్తారు. దయ, భక్తి ద్వారానే కృష్ణసాయిజ్యం లభిస్తుందని వీరు నమ్ముతారు. ఇతను రచించిన భాగవత పురాణం బహుళ ప్రచారం పొందినది.