అరుణా అసఫ ఆలీ ప్రముఖ భారత స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు. ఈమె ఢిల్లీ నగరానికి మొట్ట మొదటి మేయర్. ఈమెకు భారతప్రభుత్వం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారతరత్న’ అవార్డు (మరణానంతరం) లభించింది. 1942 సం.లో గాంధీజీ జైలుకు వెళ్లినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించిన నాయకురాలు.
ఈమె హర్యానాలోని కాల్కాలో జులై 16, 1909 న జన్మించింది. జులై 16 1996లో పరమపదించారు.