ప్రముఖ విప్లవవాది. సహాయ నిరాకరణోద్యంలో పాల్గొన్నారు. రాంప్రసాద్ బిస్మాల్ నాయకత్వంలో సాగిన ప్రతి సాయుధచర్యలో పాల్గొన్నాడు.
అసెంబ్లీపై సాహసోపేతంగా బాంబువేసిన సాహసి. ఢిల్లీ కుట్రకేసు, లాహోర్ కుట్రకేసులో నిందితుడు. 1931 జులై 27న అలహాబాద్ ఆల్ర్ఫెడ్ పార్కులో పోలీసులతో పారాడుతూ స్వయంగా కాల్చుకుని మరణించాడు. అప్పటికి అతని వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఈ పార్కు పేరు ఆజాద్ గౌరవార్ధం ఆజాద్ పార్కుగా మార్చారు.
15 సంవత్సరాల వయసులోనే గాంధీజీ వలన ప్రేరణ పొంది సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పోలీసులు ఇతనిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా తన పేరు అజాద్ అని ప్రకటించుకున్నాడు. న్యాయమూర్తి 15 రోజులు జైలు శిక్ష, 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత భగత్ సింగ్, రాజ్ గురు, పండిత రామ్ ప్రసాద్ లతో కలసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించారు. వీరు హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లకన్ అసోసియేషన్ ను స్థాపించారు.
1925 సంవత్సరంలో జరిగిన కకోరి రైలు దోపిడీలో కీలక పాత్ర వహించాడు. ఇది కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పని చేసాడు. రైలు దోపిడీ తరువాత మిగతా వారిని బ్రిటీష్ వారు పట్టుకోగలిగారు కాని చంద్రశేఖర్ ఆజాద్ ను పట్టుకోలేక పోతారు.
తరువాత ఒక ఉద్యమంలో లాలాలజపతిరాయ్ బ్రిటీష్ అధికారిచేతిలో దెబ్బలు తిని మరణిస్తాడు. అందుకు ప్రతిగా చంద్రశేఖర్ ఆ బ్రిటీష్ అధికారి స్కాట్ ను చంపబోయి పొరబాటుపడి శాండర్స్ అనే అధికారిని కాల్చి చంపుతాడు.
చంద్రశేఖర్ ఆజాద్ 1903 జులై 23వ తేదీన అలహాబాద్ లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.