తొలి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు. నెహ్రూకు పిల్లలు, పువ్వులంటే చాలా ఇష్టం.
నెహ్రూ నవంబర్ 14, 1889 సం.లో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కాశ్మీరి పండిట్ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి మోతీలాల్ సంపన్నుడైన బారిష్టర్. నెహ్రూ స్వతాహాగా పండితుడు మరియు రచయుత కూడా.
నెహ్రూ లండన్ లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ లో ఉన్నత విద్యాభ్యాసం సాగించాడు. తరువాత ఇంగ్లాండ్ లో బార్ ఎట్ లా చదివి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అలహాబాద్ న్యాయవాద వృత్తిలో ప్రవేసించాడు. కానీ ఈ వృత్తి పట్ల నెహ్రూకు పెద్దగా ఆసక్తి లేదు.
జలియన్ వాలాబాగ్ సంఘటన నెహ్రూలో గొప్ప పరివర్తనను తెచ్చింది. గాంధీ పిలుపునందుకుని సహాయ నిరాకరణోద్యంలో పాల్గొని తన వంతు కృషి చేసాడు. తరువాత అనేకసార్లు జైలు శిక్షలకు గురయ్యాడు.
సైమన్ కమీషన్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చాలాకాలం జైలు పాలయ్యాడు.
అనేకమంది స్వాతంత్ర్యవీరుల త్యాగంతో భారతదేశం ఆగస్టు 15, 1947 సం.లో స్వాతంత్ర్యం సాధించింది. నెహ్రూ తొలిప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. తరువాత నెహ్రూ చర్యలు అనేక విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా చైనా విషయంలోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర విషయంలోనూ.
చైనా యుద్ధం తరువాత మనోవేదన గురై కొంతకాలం కాశ్మీర్ లో గడిపి చివరకు 1964 మే 27వ తేదీన తెల్లవారుజామున కిర్తీశేషులయ్యారు.
/p>