భారత స్వాతంత్ర్య యోధుడు, పర్వోదయ నాయకుడు. అవినీతి నిర్మూలనకు టోటల్ రివల్యూషన్ అనే నినాదంతో 1977లో కాంగ్రస్ పార్టీ ఓడిపోవటానికి కారకుడయ్యాడు.
కళాశాల విద్యను పాట్నాలో పూర్తిచేసి, ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడ 8 సంవత్సరాలు విద్యనభ్యసించి 1929లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే జవహర్ లాల్ నెహ్రూ పిలుపునందుకొని కాంగ్రెస్ లో చేరి గాంధీకి ప్రియశిష్యుడిగా మారాడు. 1042 సంలో. క్విట్ ఇండియా కాలంలో ప్రముఖ నాయకులందరూ జైలుపాలు కాగా రాంమనోహర్ లోహియా, బాసవన్ సింగి వారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.
1954లో రాజకీయాలనుండి విరమించుకుని తన భూమినంతటిని ప్రజలకు ఇచ్చివేసి సర్వోదయ బాట పట్టాడు.
ప్రజాస్వామ్య పునరుద్దరణకు పాటుపడిన ఇతనికి భారతప్రభుత్వం 1998 అత్యున్న పురస్కారం ‘భారతరత్న’ ను ప్రకటించింది. (మరణానంతరం) ఇతను అక్టోబర్ 2వ తేదీ 1902 న జన్మించాడు. అక్టోబర్ 8, 1979లో మరణించారు.
/p>